పేకాట స్థావరంపై మెరుపు దాడి
రేగోడ్(మెదక్): పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో జూదరులను అరెస్టు చేశారు. ఆదివారం కేసుకు సంబంధించిన వివరాలు అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి వెల్లడించారు. మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలోని రేకుల షెడ్డులో హైదరాబాద్, పటాన్‌చెరు, శంకర్‌పల్లి, జనవాడ, చేవేళ్ల, ఆల్వాల్‌కు చెందిన కొందరు వచ్చి పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 19మందిలో 16మందిని అరెస్ట్ చేయగా.. ముగ్గురు పారిపోయారు. వారి వద్ద ఉన్న రూ.2లక్షల 19వేలు, సెల్‌ఫోన్‌లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. వారి వద్ద దొరికిన నగదు, వాహనాలు, సెల్‌ఫోన్‌లను కోర్టులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. పేకాట ఆడుకోవడానికి సహకరించిన, స్థలమిచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని, సంబంధిత ఆర్డీఓ అనుమతితో సీజ్ చేస్తామన్నారు. సీఐ వెంట ఎస్‌ఐ పోచయ్య, సిబ్బంది ఉన్నారు.
జహీరాబాద్‌లో 16 మంది..
జహీరాబాద్ టౌన్: పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్‌ఐ.వినయ్‌కుమార్ పేర్కొన్నారు. వివరాలు... జహీరాబాద్ పట్టణంలోని ఆర్యనగర్ కాలనీలోని మంగలి దత్తు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.59,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్యనగర్ వడ్డె నర్సింహులు ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.5,380 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
16మంది జూదరుల అరెస్ట్


