అధ్వానంగా ఐబీ భవనం
శివ్వంపేట (నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో నిర్మించిన ఐబీ భవనం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. భవనాన్ని నిర్మించినప్పటి నుంచి వినియోగించుకోకపోవడం మూలంగా పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో దర్శనమిస్తోంది. దీంతోపాటు అసాంఘిక కార్యకలాపా లకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ ఫర్నిచర్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ వినియోగించడంలో ప్రస్తుత అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వృథాగా ఉన్న ఈ భవనాన్ని ఇతర ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తూప్రాన్ నర్సాపూర్ హైవే పక్కన లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం వృథాగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి భవనం వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..
పట్టించుకోని అధికారులు


