తొగుట(దుబ్బాక): రాష్ట్ర స్థాయిలో జరిగే బీచ్ వాలీబాల్ క్రీడా పోటీలకు మండల పరిధిలోని వెంకట్రావుపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్న కంది అర్చన, బెజ్జమైన శివానీ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నహీమా తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్ 17 విభాగంలో బీచ్ వాలీబాల్ క్రీడల్లో జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికై న విద్యార్థినిలను గ్రామస్తులు అభినందించారు.
మార్షల్‌ఆర్ట్స్‌లో
జాతీయ స్థాయికి నవనీత
కౌడిపల్లి(నర్సాపూర్): మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో విద్యార్థి సత్తా చాటింది. మండలంలోని కొట్టాల తండాకు చెందిన బనోత్ నవనీత మార్షల్‌ఆర్ట్స్ ఉషూ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూర్ణచందర్, పోచయ్య తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–18 విభాగంలో నవనీత పాల్గొని బంగారు పతకం సాధించింది. 2026 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.
రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులు
రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులు


