కిక్కులక్కు ఎవరికో?
నేడే మద్యం దుకాణాలకు డ్రా
సంగారెడ్డి జోన్: జిల్లాలోని 2025–27 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్సుల కోసం సోమవారం డ్రా నిర్వహించనున్నారు. సంగారెడ్డి పట్టణంలోని జేఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11 గంటలకు కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు సంబంధిత శాఖ అధికారులు పూర్తి చేశారు. ఆయా మండలాల్లో దుకాణాలను దక్కించుకునేందుకు పోటీపడి దరఖాస్తు చేసుకున్నారు.
రూ.132.96 కోట్ల మేర ఆదాయం
జిల్లావ్యాప్తంగా 101 మద్యం దుకాణాలు 4,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున రూ.132.96 కోట్ల మేర ఆదాయం సమకూరింది. 2023లో 6,156 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది రూ.లక్ష అదనంగా పెంచడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ఈనెల 18న దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. అయితే అనుకున్నంతస్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరోసారి గడువును పెంచడంతో 420 దరఖాస్తులు అదనంగా వచ్చాయి.
ఎంపికపై ఉత్కంఠ
కొత్తగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలు ఎంపిక కోసం దరఖాస్తుదారులు లాటరీ పద్ధతిలో అదృష్టం ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని 35దుకాణాలకు 2,316 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధించి అధికారులు వెల్లడించారు. కొత్తగా ఎంపికై న మద్యం దుకాణాలకు డిసెంబర్ 1 నుంచి కేటాయిస్తారు.
101 దుకాణాలు.. 4432 దరఖాస్తులు
కలెక్టర్ అధ్యక్షతన ఎంపిక చేయనున్న అధికారులు
గతంలో కంటే తగ్గిన అప్లికేషన్లు


