పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
రామచంద్రాపురం(పటాన్‌చెరు): పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. భెల్ టౌన్‌షిప్‌లో ఆదివారం శ్రీకృష్ణదేవరాయ కాపు సేవాసమితి, పారిశ్రామికవేత్త అరవ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భవిష్యత్ తరాల వారికి మంచి వాతావరణాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. ప్రధానంగా ప్రతీ ఒక్కరిలో అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సమాజాభివృద్ధిలో అన్ని కులాలు, అన్ని మతాలు కలసిమెలసిగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా కుల పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్


