కూరగాయలకు వెళ్తుండగా..
వర్గల్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం వర్గల్ మండలం గౌరారం సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగింది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మర్కూక్ మండలం పాతూరుకు చెందిన ఉప్పరి సత్తయ్య, కనకలక్ష్మి దంపతులు కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేందుకు శనివారం తమ ఆటోలో బయల్దేరారు. గౌరారం మార్స్ పరిశ్రమ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కారు వెనక నుంచి వీరి ఆటోను ఢీకొట్టింది. ఆటో రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టడంతో ధ్వంసమైంది. ఈ ఘటనలో దంపతులు ఆటో నుంచి ఎగిరిపడటంతో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.
మరో ఘటనలో ముగ్గురికి..
దుబ్బాకరూరల్: బోలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రాజక్కపేట గ్రామంలో జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బాక నుంచి ముస్తాబాద్‌కు బొలెరో వాహనం వెళ్తున్నది. ఈ క్రమంలో రాజక్కపేట నుంచి దుబ్బాక వైపు వస్తున్న బైక్‌ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బిట్ల గణేశ్, ఆస బాలపవన్, కరికె కిశోర్‌ను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారు బోల్తా పడి ఒకరికి..
సంగారెడ్డి: కారు బోల్తాపడి ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. నాందేడ్ జాతీయ రహదారిపై చౌటకూర్ మండలం పరిధిలోని శివ్వంపేట్ గ్రామం సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీకొట్టిన కారు
దంపతులకు గాయాలు


