బైకును ఢీకొట్టిన కంటైనర్
ప్రమాదంలో వ్యక్తి మృతి
కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చెందాడు. ఈ ఘటన కందిలోగల జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... కందికి చెందిన దుర్గయ్య(62) మరో ఇద్దరితో కలిసి బైకుపై పాత కందికి వెళుతున్నాడు. ఈ క్రమంలో కందిలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మలుపు వద్ద కంటైనర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
10 కిలోల
గంజాయి స్వాధీనం
వ్యక్తి అరెస్టు
పటాన్‌చెరు టౌన్: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినాయక్ రెడ్డి వివరాల ప్రకారం... మహారాష్ట్ర ఉస్మానాబాద్‌కు చెందిన సంతోష్ మధుకర్ (34) ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకెళుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఓఆర్‌ఆర్ వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా బ్యాగ్‌తో కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా ఒడిశాలోని సురేష్ బెహరా అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశానని, లారీలో ముత్తంగి వరకు వచ్చినట్లు తెలిపారు. నిందితుడు సంతోష్ మధుకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐలు రాజు, ఆసిఫ్ అలీలను సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు అభినందించారు.


