పార్లర్ పెట్టుకుని ఉపాధి
బ్యూటీషియన్ రంగంలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందాను. సొంతంగా పార్లర్ ఏర్పాటు చేసుకున్నా. దీంతో నెలకు రూ.50 వేలకు పైగా సంపాదించుకుంటున్నా. అంతే కాకుండా ఫ్రీలాన్సర్‌గా కూడా వెళ్లి సంపాదిస్తున్నాను. దీంతో ఆర్థికంగా ఎంతో నిలదొక్కుకోగలిగాను. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తీరాయి.
– హారిక, బ్యూటీషియన్, సంగారెడ్డి
నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నా
స్థానికంగా బ్యూటీపార్లర్‌లో శిక్షణ తీసుకున్నాను. ఫ్రీలాన్స్ బ్యూటీషియన్‌గా పనిచేస్తూ నెలకు రూ.30వేలకు పైగా సంపాదిస్తున్నా. ఈ రంగంలోకి రావడంతో తమ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఇంతకు ముందు ప్రైవేటుగా పనులు చేసుకునేదాన్ని. ఇంటర్ వరకు చదువుకున్నాను.
– సమ్రీన్ బేగం, బ్యూటీషియన్, జహీరాబాద్
ఆసక్తితో శిక్షణ
బ్యూటీషియన్ రంగంపై ఆసక్తి ఉండటం వల్ల శిక్షణ తీసుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో ఇటు వైపు అడుగులు వేస్తున్నా.
– స్వాతి, జహీరాబాద్
పార్లర్ పెట్టుకుని ఉపాధి
పార్లర్ పెట్టుకుని ఉపాధి


