ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
సంగారెడ్డి జోన్: ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం రక్తదానంతో పాటు పోలీస్ అధికారులకు వ్యాసరచన పోటీలు, పరేడ్‌గ్రౌండ్‌లో ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు ఆయుధాలపై అవగాహనతో పాటు బాంబ్ స్క్వాడ్ తనిఖీ, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రక్తదానం చేసిన పలువురిని ఎస్పీ అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సుమారు 114 యూనిట్ల బ్లడ్‌ను సేకరించడం గొప్ప విషయమన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ పరితోష్ పంకజ్


