మంత్రి వివేక్‌కు హరీశ్ రావు కౌంటర్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, వారు చేసిన అప్పులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5వేల కోట్లు మిత్తి చెల్లిస్తుందన్నారు. దీంతో మిగిలిన నిధులతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. దీనికి స్పందించిన హరీశ్‌రావు మంత్రి అబద్దాలు చెబుతున్నారని, కావాలంటే తాను లెక్కలు చెబుతానన్నారు. దీనికి వివేక్ బదులిస్తూ పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ పేదలకు డబుల్‌బెడ్రూం ఇండ్లు కట్టించారా? అని లబ్ధిదారులను అడిగారు. పదేండ్లు రేషన్‌కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 16లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఇచ్చామన్నారు. మధ్యలో హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో 6.5 లక్షలపైగా రేషన్‌కార్డులు ఇచ్చామని , తప్పు అయితే ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు. ఇందుకు మంత్రి వివేక్ గత ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇచ్చి ఉంటే జిల్లాలో 26వేల రేషన్‌కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఇస్తుందన్నారు. అనవసరంగా రూ. లక్ష కోట్లు కాళేశ్వరంపై ఖర్చు పెట్టి అసలైన పథకాలకు నిధులు లేకుండా ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు.


