వేగంగా దూసుకొచ్చి ..
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
జిన్నారం (పటాన్‌చెరు): మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం... మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో మెదక్ బాలనగర్ జాతీయ రహదారి బొంతపల్లి దోమడుగు గ్రామాల మధ్య కారు అజాగ్రత్తగా మితిమీరిన వేగంతో దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. కాగా ఘటనలో కారులోని వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కారును వదిలేసి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


