నిబంధనలకు తూట్లు?
శివ్వంపేట(నర్సాపూర్): అనుమతులు లేకుండా పేద, మధ్య తరగతి ప్రజలు ఏదైనా నిర్మాణ పనులు చేపడితే అంతే అధికారులు వెంటనే స్పందించి ప్రతాపం చూపిస్తారు. కానీ, బాగా పలుకుబడి ఉండి నిబంధనలు అతిక్రమించి అక్రమ నిర్మాణ పనులు చేస్తున్న బడా వ్యాపారులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్, టూరిజం కోసం పనులు చేస్తున్నా సంబంధిత అధికారులు కిమ్మనకుండా ఉండటం వెనుక ఆంతర్యమేమిటోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
బండరాళ్లను పేల్చి.. చెట్ల తొలగింపు
మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామ పరిధిలోని పట్టా భూములు సర్వే నం.26, 27, 32లోని సుమారు 40 ఎకరాలను కమర్షియల్‌గా మార్చేందుకు హోటల్, టూరిజం పేరిట రెండు నెలల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. నాలా కన్వర్షన్ చేయకుండానే భారీ నిర్మాణ పనులు చేస్తున్నారు. పచ్చని చెట్లతో నిండిపోయిన ప్రాంతాన్ని వాల్టా చట్టానికి విరుద్ధంగా భారీ చెట్లను తొలగించి రోడ్ల నిర్మించారు. పెద్ద బండరాళ్లను కంప్రెషర్‌తో పేల్చివేస్తుండటంతో సమీప రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
హోటల్, టూరిజం రిసార్టుల నిర్మాణాల కోసం
బండరాళ్ల పేల్చివేత, చెట్ల తొలగింపు
నాలా కన్వర్షన్ లేకుండానే పనులు
చోద్యం చూస్తున్న అధికారులు
ముమ్మరంగా పనులు
పచ్చని చెట్లను నేలమట్టం చేసి రోడ్లు వేయడంతోపాటు హోటల్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 40 ఎకరాల్లో హోటల్, టూరిజం కోసం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాళ్ల పేల్చివేతకు మైనింగ్, చెట్ల నరికివేతకు అటవీ, నాలా కన్వర్షన్‌కు రెవెన్యూ, నిర్మాణ పనులకు పంచాయతీ రాజ్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిబంధనలకు తూట్లు?


