ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేయాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయుడ్ని డిప్యుటేషన్‌పై పంపకుండా సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండలంలోని కన్నారం ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌సైన్స్ బోఽధించే ఉపాధ్యాయుడు మా కొద్దంటూ విద్యార్థులు ఽఈనెల 17న ధర్నా చేయగా మంగళవారం ఆర్‌జేడీ, డీఈఓ, ఎంఈఓ పాఠశాలలో విచారణ చేశారు. ఈ విషయమై బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మహిపాల్‌రెడ్డి, విఠల్, నారాయణ, యాదాగౌడ్, యాదుల్, పోచయ్య తదితరులు మాట్లాడారు. ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌గౌడ్ ఓ సంఘంలో జిల్లా పదవిలో ఉన్నాడని అతని పలుకుబడితో డిప్యూటేషన్ వెళ్లేందుకు పైరవీలు చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో విధులు నిర్వహించిన పాఠశాలల్లో సైతం పాఠాలు చెప్పకుండా యూనియన్ కార్యకలాపాలు చేస్తూ తోటి ఉపాధ్యాయులతో గొడవలు పెట్టుకోవడం పరిపాటిగా మారిందన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం చేస్తున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కన్నారం గ్రామస్తుల డిమాండ్


