భారీగా గంజాయి పట్టివేత
తూప్రాన్: కారులో తరలిస్తున్న సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా... నాగపూర్‌కు చెందిన నిందితుడు చాంద్‌పాషాతో పాటు మరో ఇద్దరు యువకులు కారులో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువ చేసే 100 కిలోల ఎండు గంజాయిని నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు తన కుటుంబ సభ్యులను కారులో ఎక్కించుకొని వస్తున్నారు. మార్గమధ్యలో టోల్‌ప్లాజాల వద్ద కారును ఆపకుండా వస్తున్నారు. దీంతో అప్పటికే సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ శ్రీనివాస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద వాహనంతో కాపు కాశారు. గంజాయి కలిగిన కారు టోల్‌ప్లాజా వద్ద ఆపకుండా స్టాఫర్‌ను ఢీకొని అతివేగంగా వెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని అడ్డం పెట్టడంతో నిందితులు ప్రయాణిస్తున్న కారు పాలీసుల వాహనంను ఢీకొని బోల్తాపడింది. కారులోంచి మంటలు చెలరేగాయి. టోల్‌ప్లాజా సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం కారు నుంచి బ్యాగుల్లో దాచిన సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


