హామీలన్నీ అమలు చేస్తాం
సిద్దిపేటరూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక, మైనింగ్, పరిశ్రమల శాఖ మంత్రి జి.వివేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో సిద్దిపేట నియోజకవర్గం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం పథకాలను నెమ్మదిగా అమలు చేస్తుందన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
వర్గల్(గజ్వేల్): ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని వెద్యులకు మంత్రి వివేక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని బుధవారం రాత్రి మంత్రి వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పీహెచ్‌సీ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోగా, సకాలంలో తాము పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రికి అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, తహసీల్దార్ రఘువీర్‌రెడ్డి, ఎంపీడీవో మశ్చేందర్, వైద్యాధికారి దీప పాల్గొన్నారు.
మంత్రి జి.వివేక్
కలెక్టరేట్‌లో
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


