రూ.వేలు ఖర్చవుతున్నాయి
ప్రతీ ఏటా పంటల సీజన్‌లో టార్పాలిన్ల అద్దెకోసం రూ.ఆరు వేల వరకు వేలు ఖర్చవుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలి. ఇప్పటికే సమస్యల్లో కూరుకుపోయిన తమకు అదనపు భారంగా మారింది.
–లాల్య నాయక్, చౌకత్‌పల్లి తండా
ఉచితంగా సరఫరా చేయాలి
ప్రతీ రైతుకు ప్రభుత్వమే ఉచితంగా టార్పాలిన్లు సరఫరా చేయాలి. ఇవి అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలనుంచి అద్దెకు తెచ్చుకుంటున్నాం. ఈ భారాన్ని తమపై మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– కంలియా నాయక్, దంతేపల్లి తండా
గతంలోనే రద్దయింది
రైతులకు సబ్సిడీపై టార్పాలిన్ల పంపిణీ పథకం నాలుగేళ్ల క్రితమే రద్దయింది. పథకాన్ని పునరుద్ధరించాలని చాలామంది రైతులు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి మంజూరైతే ఇస్తాం.
–రాజ్‌నారాయణ, ఏడీఏ, రామాయంపేట
రూ.వేలు ఖర్చవుతున్నాయి
రూ.వేలు ఖర్చవుతున్నాయి


