పప్పు ధాన్యాల సాగు పెంచాలి
జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్
ఝరాసంగం(జహీరాబాద్): నూనె గింజలతో పాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఝరాసంగంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో అధిక దిగుబడులు ఇచ్చే పప్పు దిను సుల వంగడాలపై రైతులకు అవగాహన కల్పించారు. మండలానికి మంజూరైన 10 క్వింటాళ్ల కుసుమ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విత్తనోత్పత్తి కార్యక్రమాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అధికారుల సూచనలు సలహాలు పాటించి పంటల్లో అధిక దిగుబడులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్, ఏఈఓలు, రైతులు, పాల్గొన్నారు.


