నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్
రేగోడ్(మెదక్)/పాపన్నపేట(మెదక్): నూనె గింజల ఉత్పత్తులను పెంచాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రేగోడ్‌లోని రైతువేదిక కార్యాలయంలో మంగళవారం నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ అధికారి, రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. పొద్దుతిరుగుడు 93%, శనగ విత్తనాలు 50% రాయితీతో ఎంపిక చేసిన రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ప్రతీ రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నూనెగింజల ఉత్పత్తి ద్వారా స్థానిక సాధికారతను సాధించి దిగుమతులను తగ్గించుకోవచ్చని తెలిపారు.


