ట్రాక్టర్ ఢీకొని.. మహిళ మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కామారం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన ఇందూర్ సాలవ్వ(50) శనివారం ధాన్యం ఆరబెట్టేందుకు కూలిపనులకు వెళ్లింది. అదే గ్రామానికి చెంది న రైతు భాగయ్య బంధువు ఆవుసులపల్లి గ్రామాని కి చెందిన కుంట స్వామి ట్రాక్టర్‌లో ధాన్యం తీసుకువస్తూ రివర్స్ చేస్తున్న క్రమంలో మహిళను గమనించకుండా ఢీకొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే గాంఽధీ ఆస్పత్రికి తరలించ గా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వాహనం ఢీకొని కూలీ..
మనోహరాబాద్(తూప్రాన్): గుర్తు తెలియని వాహనం ఢీకొని కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ వివరాల ప్రకారం... పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లకు చెందిన మన్నె దశరథ (38) కూలీ పని కోసం శనివారం మండలంలోని కాళ్లకల్‌కు వచ్చాడు. రాత్రి శివారులో దీపక్ దాబా వద్ద జాతీయ రహదారి –44పై రోడ్డు దాటుతున్న క్రమంలో కంటైనర్ ఢీకొట్టడంతో లారి కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన బెన్ని కుమార్ (58) మెదక్ ఇరిగేషన్ కార్యాయలంలో విధులు ముగించుకుని అదే గ్రామానికి చెందిన నిఖిల్ స్కూటీపై వస్తున్నారు. గవ్వలపల్లి చౌరస్తా వద్ద టీవీఎస్ ఎక్స్‌ఎల్ అడ్డుగా రావడంతో అదుపుతప్పి ఢీకొట్టారు. దీంతో బెన్నికుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడ్ని మేడ్చల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
ట్రాక్టర్ ఢీకొని.. మహిళ మృతి


