జీవితాల్లో వెలుగులు నింపాలి | - | Sakshi
Sakshi News home page

జీవితాల్లో వెలుగులు నింపాలి

Oct 20 2025 9:32 AM | Updated on Oct 20 2025 9:32 AM

జీవిత

జీవితాల్లో వెలుగులు నింపాలి

కలెక్టర్‌ ప్రావీణ్య

సంగారెడ్డి జోన్‌: దీపావళి వెలుగులు ప్రతీ ఇంటిలో ఆనందం నింపాలని ఈ పండుగను ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని కలెక్టర్‌ పి.ప్రావీణ్య ఆకాంక్షించారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. పర్యావరణహిత టపాసులను వినియోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు.

కపాస్‌ కిసాన్‌ యాప్‌లో

నమోదు తప్పనిసరి

రాయికోడ్‌(అందోల్‌): సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్మాలంటే రైతులు తప్పనిసరిగా కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌బుక్‌ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సారిక స్పష్టం చేశారు. పంట విక్రయించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని కేంద్ర ప్రభుత్వం యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేయించుకునే ప్రక్రియను తప్పనిసరి చేసిందని ఆదివారం ఓ ప్రకటనలో వివరించారు. పత్తి రైతులు తమ పరిధిలోని ఏఈఓలను సంప్రదించి యాప్‌లో తమ పేరుపై బుకింగ్‌ అయిందా లేదా అనే అంశాన్ని గుర్తించాలన్నారు.

లింగాయత్‌ సమాజ్‌ అధ్యక్షుడిగా రాజశేఖర్‌

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ పట్టణ లింగాయత్‌ సమాజ్‌ అధ్యక్షుడిగా రాజశేఖర్‌ షెట్కార్‌ వరుసగా నాలుగవసారి ఎన్నికయ్యారు. పట్టణంలోని బసవ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడిని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న రాజశేఖర్‌ షెట్కార్‌ను వీరశైవ లింగాయత్‌ సమాజ్‌ నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ షెట్కార్‌ మాట్లాడుతూ..వరుసగా సమాజ్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృజ్ఞతలు తెలిపారు. లింగయాత్‌ సమాజ్‌ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో

ఇబ్బందులు

జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ

సభ్యుడు చంద్రశేఖర్‌

పటాన్‌చెరు టౌన్‌: కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్‌ కాలనీ వాసులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని బండ్లగూడ బాలాజీ నగర్‌ కాలనీలో సీసీరోడ్డు కారణంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సమస్య నెలకొనడంతో డ్రైనేజీ పనులను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా సీసీ రోడ్డు వేయగా..అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ మూసుకుపోయి, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు.

భవన్స్‌లో ఘనంగా

దివాళీ మేళా

రామచంద్రాపురం(పటాన్‌చెరు): బెల్‌ టౌన్‌షిప్‌లోని భవన్స్‌ పాఠశాలలో శనివారం రాత్రి దివాళీ మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీసీపీ సృజన, భవన్స్‌ హైదరాబాద్‌ వైస్‌ చైర్మన్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రాదాయాలపై చిన్ననాటి నుంచి విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బెల్‌ జీఎం డా.సంధ్యాకర్‌, ప్రిన్సిపాల్‌ ఉమాశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

జీవితాల్లో వెలుగులు నింపాలి1
1/3

జీవితాల్లో వెలుగులు నింపాలి

జీవితాల్లో వెలుగులు నింపాలి2
2/3

జీవితాల్లో వెలుగులు నింపాలి

జీవితాల్లో వెలుగులు నింపాలి3
3/3

జీవితాల్లో వెలుగులు నింపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement