భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక
పటాన్‌చెరు: మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెంమహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. జీవనోపాధి కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చి దశాబ్దాలుగా నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరి అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటిగ్రామ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. దీపావళి పర్వదినం పురస్కరించుకుని ప్రతీఏటా ఉత్తర భారతీయులు ఘనంగా నిర్వహించుకునే చట్ పూజ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎంపీటీసీగా ఎన్నికై న నాటి నుంచి ఎంపీపీ, మూడుసార్లు పటాన్‌చెరు ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో ఇక్కడి ఉత్తరభారతీయుల మద్దతు మరువలేనిదని చెప్పారు. అతి త్వరలో ఉత్తర భారతీయుల కోసం ఫంక్షన్ హాల్, సాకి చెరువు కట్టపై సూర్యదేవుడి ఆలయం నిర్మించబోతున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


