అంబేడ్కర్ స్ఫూర్తితోనే ఉద్యోగం
జహీరాబాద్: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్ఫూర్తితోనే తాను గ్రూప్ –1లో విజయం సాధించగలిగానని జహీరాబాద్ పట్టణానికి చెందిన సాహితి పేర్కొన్నారు. గ్రూప్–1లో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా నియమితులైన సందర్భంగా మాల సంఘాల ఆధ్వర్యంలో ఆమెను ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాహితి మాట్లాడుతూ...తాను చిన్ననాటి నుంచి ఉపాధ్యాయుడైన తన తండ్రి శ్రీనివాస్ ద్వారా అంబేడ్కర్ గురించి తెలుసుకుని ఆయన పట్టుదల, స్ఫూర్తితోనే కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించగలిగానన్నారు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు. సామాజిక బాధ్యతగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పాఠశాలలకు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ఉచితంగా అందించి తనవంతు తోడ్పడతానని హామీనిచ్చారు.
గ్రూప్–1 విజేత సాహితి


