సమస్యల పరిష్కారానికి కృషి
జిన్నారం(పటాన్‌చెరు): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారం ప్రకృతి నివాస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో కాలనీ వాసులకు ఇచ్చిన హామీ మేరకు కాలనీని సందర్శించానన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరించారు. వెంటనే సమస్యల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి, సొసైటీ సభ్యులు వీణాచిన్న, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


