తహసీల్‌గ్రౌండ్‌లోబాణసంచా దుకాణాలు
నారాయణఖేడ్: ప్రమాదాలకు అవకాశం లేకుండా చుట్టుపక్కల నివాసగృహాలు లేని, పక్కనే అగ్నిమాపక కేంద్రం ఉన్న ఖేడ్ తహసీల్ గ్రౌండ్‌లో బాణసంచా దుకాణాలకు అధికారులు అనుమతులివ్వడంతో దుకాణాదారులు శనివారం షెడ్లు, టెంట్లతో దుకాణాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీధర్ ఇదివరకే ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్ల గురించి అవగాహన కల్పించగా ఈ మేరకు దుకాణాదారులు వాటిని పాటిస్తూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రాజన్నను దర్శించుకున్న దత్తగిరి మహారాజ్
వేములవాడ: వేములవాడ రాజన్నను బర్దీపూర్ (సంగారెడ్డి జిల్లా)కు చెందిన దత్తగిరి మహారాజ్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు మహారాజ్ అందజేశారు. ఆయన వెంట ప్రొటోకాల్ ఏఈవో అశోక్‌కుమార్, ఆలయ పర్యవేక్షకులు నునుగొండ రాజేందర్, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు ఉన్నారు.
నక్కవాగులో
అక్రమ తవ్వకాలు
సాక్షి, సిటీబ్యూరో: రామచంద్రాపురంలోని నక్కవాగులో అక్రమంగా మట్టి, ఇసుకను తవ్వుతున్న ముఠా గుట్టు రట్టయింది. రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్ట్, మైన్స్, పోలీసు విభాగాలతో సమన్వయంతో ఆర్సీపురం యూనిట్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కంది మండలం బైయాథోల్ గ్రామంలోని నక్కవాగులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ట్రాక్టర్ పంపులు వినియోగించి వాగులో నుంచి మట్టి, ఇసుకను తవ్వుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి లారీలు, ఇతర భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే నిందితులు తాత్కాలిక నిర్మాణాలను నిర్మించి నక్కవాగు ప్రవహించే రెండు మార్గాలను అడ్డుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇరిగేషన్ విభాగానికి సమాచారం అందించి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎర్రోళ్లకు ఈటల పరామర్శ
చిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరామర్శించారు. ఎర్రోళ్ల తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం గంగాపూర్‌లోని ఆయన నివాసంలో ఈటల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. అంతకుముందు గంగాపూర్ పెద్దమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
తహసీల్‌గ్రౌండ్‌లోబాణసంచా దుకాణాలు


