జిల్లాలో బీసీ బంద్ విజయవంతం
● పాల్గొన్న పార్టీ నేతలు, వివిధ సంఘాల నాయకులు ● స్వచ్ఛందంగా పాటించిన వ్యాపార సముదాయాలు
సంగారెడ్డి: జిల్లాలో చేపట్టిన బీసీ రిజర్వేషన్లపై బంద్ శనివారం విజయవంతమైంది. జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు ఆయా మండలాలు, పట్టణాలు, గ్రామాలలో బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలతో పాటు,సీపీఎం,సీపీఐ ఆయా సంఘాల నాయ కులు, నేతలు, విద్యార్థి సంఘాలు పాల్గొని వ్యాపార కార్యకలాపాలు జరగకుండా చూశారు. ఈ బంద్‌లో స్వచ్ఛందంగా ఆర్టీసీ, వివిధ వ్యాపార సముదాయాలు బంద్‌ను పాటించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుగౌడ్, పలు సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.


