సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన
న్యాల్‌కల్(జహీరాబాద్): రెండు నెలలుగా గౌరవ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం చర్యలు తీసుకొని వేతనాలు వెంటనే చెల్లించాలని ఎస్‌ఎస్‌ఏ (సర్వ శిక్ష అభియాన్) ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమయానికి వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రవి, మానిక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


