కుక్కల దాడిలో లేగదూడ మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): కుక్కల దాడిలో ఓ లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మోత్కులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మడక తిరుపతికి రెండున్నరేళ్ల ఆవుదూడ కుక్కల దాడిలో మరణించింది. దీని విలువ సుమారుగా రూ.40వేల వరకు ఉంటుందని పలువురు రైతులు తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, పిల్లలు, వృద్ధులు, పశువులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.


