కారు అద్దాలు పగులగొట్టి..
రూ.1.50 లక్షలు చోరీ
కంది(సంగారెడ్డి): కారులో ఉన్న నగదును గుర్తు తెలియని దండగులు చోరీ చేశారు. ఈ ఘటన కాశీపూర్ శివారులో చోటుచేసుకుంది. ఇంద్రకరణ్ ఎస్‌ఐ విజయ్ కుమార్ కథనం ప్రకారం... పటాన్ చెరు మండలం బీరంగూడకు చెందిన పిల్లబోయిన శ్రవణ్ కుమార్ తన కారులో రూ.లక్షా 50 వేలు ఉంచి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లాడు. కార్యాలయంలో పని ముగించుకుని సాయంత్రం 3:30 గంటల సమయంలో తిరిగి వచ్చి చూసేసరికి కారు అద్దాలు పగులగొట్టి డబ్బుల బ్యాగును అపహరించినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ క్రాంతికుమార్, టౌన్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.


