రసమయి ఫాంహౌస్‌పై దాడి
● దిష్టిబొమ్మ దహనం,
స్వల్ప ఉద్రిక్తత
● పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్న ఇరు పార్టీల నాయకులు
బెజ్జంకి(సిద్దిపేట): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల గొడవతో మండలంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదనపు డీసీపీ విశాల్ కుషాల్కర్ బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితులు పరిశీలించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గుండారంలో గల రసమయి ఫాంహౌస్ ముట్టడికి యత్నించారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయగా అద్దాలు పగిలాయి. ఫామ్‌హౌస్ వద్ద ఏసీపీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఫాంహౌస్ వద్దకు వచ్చిన బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాల కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు బెజ్జంకిలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దహనం చేయగా, బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేను దూషించిన మాజీ ఎమ్మెల్యే రసమయిపై చర్యలు తీసుకోవాలని అదనపు డీసీపీ విశాల్ కుషాల్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు శ్రీను, ఉపేందర్, ఎస్‌ఐలు సౌజన్య, రాజేశ్, అలీ, పోలీసు, సీఆర్‌పీఎఫ్ జవాన్‌లు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
రసమయి ఫాంహౌస్‌పై దాడి


