ఆర్టీసీ బస్సు ఢీకొని..
● ఇద్దరు కూలీలదుర్మరణం
● సిద్దిపేట జిల్లాలో ఘటన
ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన ములుగు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం... మండలంలోని కమలాబాద్ గ్రామానికి చెందిన బోయిని సాయిలు(65), మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన లెంకల రాజమల్లు(55) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే ములుగు రెవెన్యూ కార్యాలయ సమీంపలో రాజీవ్‌రహదారి డివైడర్‌పై గడ్డిని కత్తిరించే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యంగా, అతివేగంగా వచ్చి కూలీలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో కూలీలు సాయిలు, రాజమల్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు నుజ్జునుజ్జయి రోడ్డుకు అతుక్కుపోయాయి. ఈ మేరకు ఆర్టీసీ డ్రైవర్ మహ్మద్‌రఫీపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కమలాబాద్‌కు చెందిన మృతుడు సాయిలుకు భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మరో మృతుడు రాజమల్లుకు భార్య అనసూయ, కూతురు, కుమారుడు ఉన్నారు.
రాజమల్లు
సాయిలు
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ఆర్టీసీ బస్సు ఢీకొని..


