సాగుపై మహిళా రైతులకు అవగాహన
చేగుంట(తూప్రాన్): మండలంలోని పలు గ్రామాల మహిళా రైతులు సెహగల్ ఫౌండేషన్ హైటెక్ సీడ్స్ ప్రతినిధుల సౌజన్యంతో శుక్రవారం ఇక్రిసాట్ సందర్శనకు వెళ్లారు. పరిశోధనాలయంలో వారికి పెరటి తోటల పెంపకం, డ్రమ్ సీడర్, వరి పంట, డ్రిప్ ద్వారా పంటలు సాగు చేసే విధానం గురించి అవగాహన కల్పించారు. భూమి చదును, వర్మీకంపోస్టు తయారీ, పంటలను ఆశించే క్రిమి కీటకాలు, వాటి నివారణ చర్యల గురించి ప్రయోగశాలలో రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు నీరజ్ కుమార్, అవినాష్, ఫీల్డ్ అసిస్టెంట్లు విజయ్, శ్రవణ్, బాబు పాల్గొన్నారు.


