మా భూముల జోలికొస్తే ఊరుకోం
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని కట్కూర్ గ్రామంలో దళితుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామంలోని దోమ రాజిరెడ్డి ఇంటి నుంచి దుబ్బతండా గ్రామానికి వెళ్లే దారి వరకు సుమారుగా 1.20 గుంటల భూమి ఉందన్నారు. ఈ భూమిని సహకార సంఘం వరి ధాన్యం కొనుగోలు పేరిట కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించాలని, లేనిపక్షంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


