ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి
ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే టపాకాయల దుకాణాదారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఓ ప్రకటనలో తెలిపారు. జనావాసాలకు దూరంగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత సబ్–డివిజన్ పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎవరైనా పోలీసుల నుంచి అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే ఎక్స్ ప్లోజివ్ యాక్టు 1884 ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
దుకాణాదారులు పాటించాల్సిన నిబంధనలు
● దుకాణాలు జనావాసాలకు దూరంగా, ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి.
● దుకాణం ఉన్న ప్రదేశానికి స్థల యజమాని నుంచి ఎన్‌ఓసి సర్టిఫికెట్ పొంది ఉండాలి.
● దుకాణాల మధ్య వ్యత్యాసం 3 మీటర్లు, గృహనిర్మాణాలకు 50 మీటర్ల దూరంలో ఉండాలి.
● జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎలాంటి టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదు.
● ఫైర్ ఆక్సిడెంట్‌కు సంబంధించి తక్షణం స్పందించే విధంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.


