మనసున్న మాస్టారు..
39 మంది విద్యార్థులకు
క్రీడా దుస్తుల అందజేత
ఉపాధ్యాయుడు రమేశ్ సేవలు
అభినందనీయం: హెచ్‌ఎం
తొగుట(దుబ్బాక): విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేసిన ఉపాధ్యాయుడు ముక్క రమేశ్ అభినందనీయుడని ప్రధానోపాధ్యాయుడు నయీమా కౌసర్ అన్నారు. మండలంలోని వెంకట్రావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో చేరిన 39మందికి రమేశ్ దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ పేద కుటుంబాల విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని గమనించి వారి అవసరాలను తీర్చడం గొప్ప విషయమన్నారు. ఐదేళ్లుగా విద్యార్థులకు ఏదో రకంగా అండగా నిలుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఒరాకిల్ స్వచ్ఛంద సంస్థ నుంచి రూ 40వేల విరాళంగా సేకరించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని పేర్కొన్నా రు. అలాగే విద్యార్థులకు రూ 5వేల విలువగల క్రీడా సామగ్రిని అందించారని తెలిపారు. విద్యార్థులు ఎంఎంఎస్ పరీక్షలకు సిద్ధం కావడాని కి రూ 3వేల విలువగల పుస్తకాలు అందించా రని గుర్తుచేశారు. రమేష్ అందిస్తున్న సేవా కార్యక్రమాల మూలంగా పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోందన్నారు.


