ఎంచె దాటేదెలా.. పంట చేరేదెలా!
వరద మిగిల్చిన నష్టం అన్నదాతలను వీడటం లేదు. మంజీరా వరదలతో కుర్తివాడ ఎంచె (వంతెన)కొట్టుకు పోయింది. ఇంత వరకు తాత్కాలిక మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో వంతెన అవతల మంజీరా ఒడ్డున సాగుచేసిన 200 ఎకరాల పంట నీటిపాలైంది. అలాగే సుమారు 800 ఎకరాల్లో పండిన వరి పంట కోత కొచ్చింది. కోసిన ధాన్యం ఇంటికి రావాలంటే ఎంచె ఒక్కటే మార్గం. 2008లో అప్పటి ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి చొరవతో రూ.78 లక్షల వ్యయంతో ఈ వంతెన నిర్మించారు. ఇటీవల వరదలతో రోడ్డు కొట్టుకు పోయిందని, ఇప్పుడు ధాన్యం ఇంటికి తీసుకు రావాలంటే మార్గం మూసుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే చేతికొచ్చిన పంట కూడా నీటి పాలవుతుందని, అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
– పాపన్నపేట(మెదక్)


