మౌలిక సదుపాయాలు కల్పించండి
సంగారెడ్డి జోన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణరావు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయవద్దని, ప్రతీ మండలం, నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులు, సూపర్‌వైజర్లను నియమించాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. వాతావరణ శాఖ నివేదికలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్, టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముందుగా హార్వెస్టర్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం రైతుల విశ్రాంతి కోసం షెడ్ల ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో డీఎం సివిల్ సప్లై అధికారి అంబదాస్ రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి బాలసరోజ, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్, పీడీ డీఆర్డిఏ జ్యోతి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, తూనికలు కొలతల శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య


