భరోసా సేవలు అభినందనీయం
సంగారెడ్డి జోన్: భరోసా కేంద్రం ద్వారా అందించే సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని భరోసా కేంద్రంలో భరోసా ఐదవ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...మహిళలు, బాలికల సంరక్షణకు పెద్దపీట వేశామన్నారు. మహిళలు, పిల్లలు భయం వీడి నిర్భయంగా వచ్చి తమ సమస్యను తెలుపుకోవచ్చని ధైర్యం చెప్పారు. గత ఐదేళ్లలో 657 పోక్సో, అత్యాచార కేసుల్లో వైద్య, న్యాయ సేవలను అందించినట్లు తెలిపారు. 407 కేసులలో రూ1.73 కోట్ల పరిహారం, 24 మందికి మిషన్ వాత్సల్య స్కాలర్ షిప్ రూ.64లక్షలు అందించినట్లు వివరించారు. తక్షణ పరిహారంగా డీఎల్‌ఎస్‌ఏ నుంచి రూ. లక్షను, విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 50 మందికి రూ: 2.83లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భరోసా నోడల్ అధికారి, అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, డీఎస్పీ సత్తయ్యగౌడ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్


