వేర్వేరు ప్రాంతాల్లో ఘటన
ఇద్దరి బలవన్మరణం
రామాయంపేట(మెదక్): రామాయంపేట మండల పరిధిలో వేర్వేరు కారణాల తో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. సదాశివనగర్ తండాకు చెందిన లంబాడి మున్యా (35) వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. తెల్లవారు జామున అతని భార్య లేచి చూడగా, ఇంట్లో ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. దీంతో భయాందోళన చెందిన ఆమె విలపిస్తూ ఈ విషయమై తండా వాసులకు సమాచారం అందించింది. ఎస్‌ఐ బాల్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కేసీఆర్ కాలనీలో ..
మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ (38) స్థానిక డబుల్ బెడ్‌రూం కాలనీ ( కేసీఆర్ కాలనీ)లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న బాలకృష్ణ రాత్రి తన వ్యవసాయ బోరు వద్ద క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు ప్రాంతాల్లో ఘటన


