గంజాయి సాగుపై పోలీసుల కూంబింగ్
నారాయణఖేడ్: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు ఖేడ్ డివిజన్ పరిధిలో మంగళవారం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి అక్రమ గంజాయిసాగు, నిల్వల గురించి కూంబింగ్ నిర్వహించారు. ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై రావుల శ్రీశైలం ఆధ్వర్యంలో ఠాణాల ఎస్సైలు, సిబ్బంది, క్యూఆర్టీ టీంలు మంగళవారం పలు గ్రామాలు, తండాల శివార్లలోని పంట పొలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక నుంచి అన్ని గ్రామాలు, తండాల్లో తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ తెలిపారు. గంజాయిసాగు, నిల్వతో ఎవరైనా పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు, హిస్టరీషీట్ తెరుస్తామని, రైతుభరోసా నిలిపివేత చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయిసాగు, నిల్వల గురించి ఎవరికై నా తెలిస్తే డీఎస్పీ నంబర్ 87126 56709 కు, ఖేడ్ సీఐ 87126 56733 కు, ఖేడ్ ఎస్సై 87126 56757 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.


