తల్లికి తలకొరివి పెట్టిన కూతురు
అనాథగా మిగిలిన మానసిక వికలాంగురాలు
నంగునూరు(సిద్దిపేట): తల్లికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మంగళవారం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెంబర్ల కొమురవ్వ (85)కు నలుగురు కూతుళ్లు. ముగ్గురి పెళ్లి చేసిన అనంతరం భర్త గురువయ్య మరణించడంతో మానసిక వికలాంగురాలైన చిన్న కూతురు విజయతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న కొమురవ్వ మంగళవారం మృతి చెందింది. కుమారులు లేకపోవడంతో పెద్ద కూతురు అరుణ తల్లికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. తల్లి మరణంతో వికలాంగురాలైన విజయ అనాథగా మిగిలింది.


