బాణసంచా దుకాణాల కేటాయింపు
నారాయణఖేడ్: దీపావళి పండుగను పురస్కరించుకుని ఖేడ్ పట్టణంలోని తహసీల్ గ్రౌండ్‌లో బాణసంచా దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులకు మంగళవారం లాటరీ ద్వారా వాటిని కేటాయించారు. దుకాణాలను ఏర్పాటుకు 24 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్ కార్యాలయం నుంచి అటవీశాఖ కార్యాలయం ముందు వరకు అక్కడి నుంచి ఐబీ కార్యాలయం వైపునకు ఏర్పాటు చేసుకోవడానికి లాటరీ తీసి దుకాణాలను కేటాయించారు. వ్యాపారులు నిర్ణీత రుసుము చెల్లించి నిబంధనల ప్రకారం బాణసంచా విక్రయించాలని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటేశివయ్య, శానిటేషన్ అధికారి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. అంతకుముందు లాటరీ విధానాన్ని దుకాణాల కేటాయింపు తీరును మైదానంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి పరిశీలించారు.
అనుమతి లేకుండా
విక్రయిస్తే చర్యలే
జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వర్‌రావు
సంగారెడ్డి క్రైమ్: జిల్లాలో అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పనిసరని జిల్లా అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వర్‌రావు హెచ్చరించారు. తన కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ..బాణసంచా విక్రయాల కోసం ఇప్పటివరకు 242 దరఖాస్తులు రాగా 162 దుకాణాలకు మాత్రమే అనుమతులు మంజూరు చేశామన్నారు. పీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్, బైపాస్‌లోని మహిళా ప్రాంగణం, మండే మార్కెట్లో దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
పారిశుద్ధ్యం లోపించవద్దు
డీపీఓ సాయిబాబా
కంది(సంగారెడ్డి): గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని డీపీఓ సాయిబాబా సూచించారు. మండల పరిధిలోని వడ్డెనగూడ, కొయ్యగుండు తండాల్లో పారిశుద్ధ్య పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తడి,పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు పంచాయతీ సిబ్బంది వివరించాలన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.
వరి కొనుగోలు కేంద్రాలను
వినియోగించుకోవాలి
డీఆర్డీఏ జ్యోతి
సంగారెడ్డి టౌన్: గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని డీఆర్డీఏ జ్యోతి సూచించారు. సంగారెడ్డిలోని మహిళా సమాఖ్య కేంద్రంలో సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మహిళా సంఘాల సభ్యుల చేత కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చామన్నారు.
ఖైదీలకూ న్యాయసహాయం
జిల్లా న్యాయ సేవాధికారి
సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: జైలులో ఉన్న ఖైదీలకు న్యాయపరమైన సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య స్పష్టం చేశారు. కందిలోని సెంట్రల్ జైలులో ఆమె మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఖైదీలకు కనీస సదుపాయాల అందించాలని సమయానికి బెయిల్, ములాఖత్ అందించాలన్నారు. వంటశాలను, లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఆమె వెంట జిల్లా జైలు అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.
బాణసంచా దుకాణాల కేటాయింపు
బాణసంచా దుకాణాల కేటాయింపు


