18న బంద్‌ను విజయవంతం చేయాలి
సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మంగళవారం ఐబీలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు బంద్‌లో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ...బీసీలకు 42% రిజర్వేషన్లను రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, నాయకులు కూన వేణు, కుమ్మరి సాయిలు, శ్రీధర్ మహేంద్ర, రమేశ్ గౌడ్, పుల్లంగారి సురేందర్, గోకుల్ కృష్ణ, బలరాం, కృష్ణమూర్తి, రాందాస్ పాల్గొన్నారు.
బీసీ నేతల రౌండ్‌టేబుల్ సమావేశం


