నిమ్జ్‌లో రైతుల సందడి
జహీరాబాద్ టౌన్: రెండు నెలల తర్వాత జహీరాబాద్ నిమ్జ్ కార్యాలయంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పరిహారం చెక్కుల కోసం రైతులు పట్టణంలోని నిమ్జ్ కార్యాలయానికి రావడంతో సందడి నెలకొంది. జూలై 10న నిమ్జ్ కార్యాయలంలో ఏసీబీ దాడులు చేయడంతో భూసేకరణకు సంబంధించి పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. స్పీడ్ అందుకున్న భూ సేకరణ పనులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్‌గా విశాలాక్షి పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆమె భూసేకరణపై శ్రద్ధ చూపుతున్నారు. దీంతో ప్రాజెక్టులో భూములు కొల్పోయిన రైతులు పరిహారం చెక్కుల కోసం కార్యాలయానికి వస్తున్నారు.
మళ్లీ ఊపందుకున్న కార్యకలాపాలు


