
ప్రజావాణికి వినతుల వెల్లువ
సంగారెడ్డి జోన్: ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల ముందు వెల్లబోసుకున్నారు. డీఆర్‌ఓ పద్మజరాణితో పాటు ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్‌డీఓ జ్యోతి వినతులు స్వీకరించారు. అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 57 వినతులు వచ్చినట్లు వెల్లడించారు.
పింఛన్ మంజూరు చేయండి
వికలాంగుల ఫించన్ మంజూరి చేసి ఆదుకోవాలి. అన్ని అర్హతలు ఉన్నా, కొన్ని సంవత్సరాలుగా పింఛన్ రావడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లానా ప్రయోజనం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా. అధికారులు చర్యలు తీసుకొని ఆదుకోవాలి.
– మాణిక్‌రెడ్డి, చేర్యాల గ్రామం,
కంది మండలం
ఆర్థిక సహాయం అందించాలి
సిగాచీ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్‌గా విధు లు నిర్వర్తించాను. ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలు కావటంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నా. రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని, రూ. 5 లక్షలు అందించారు. ఇప్పటివరకు మిగితా సహాయం అందించలేదు. అధికారులు చర్యలు తీసుకుని ఆర్థిక సహాయం అందించాలి.
– కమలేష్ ముఖిమ్, బిహార్
కానిస్టేబుల్ ఉత్తమ ప్రతిభ
సంగారెడ్డి జోన్: రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా కానిస్టేబుల్ ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. ఈ మేరకు ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం అభినందించారు. జూలై 31 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు వరంగల్‌లోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. జిల్లా నుంచి హాజరైన సైబర్ పోలీస్ కానిస్టేబుల్ రాజలింగం రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచాడు. త్వరలో పూణెలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో మెరుగైన ప్రదర్శన చూపి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.

ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ