
క్షేత్రస్థాయిలో.. సాగు పాఠాలు
● గ్రామీణ కృషి అనుభవంలో వ్యవసాయ విద్యార్థులు ● కేవీకే శాస్త్రవేత్త రవికుమార్ ఆధ్వర్యంలో అవగాహన
సేంద్రీయ సాగుపై అవగాహన
రైతులు తమ ఆరోగ్య ప్రయోజనాలను, నేల సారాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా ఉన్న భూమిలో కొంతవరకై నా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. తమ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు కనీసం కొంత మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసే విధంగా కృషి చేస్తా. ప్రాజెక్ట్‌లో భాగంగా మేము రైతులకు తెలియజేసిన విషయాల కంటే, మేము వారి ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాం.
– టి.అక్షయ, అగ్రికల్చర్ విద్యార్థి,
మల్లారెడ్డి యూనివర్సిటీ
రైతుల సహకారం బాగుంది
గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా శీలాంపల్లి గ్రామ రైతుల సహకారం బాగుంది. ఈ ప్రాజెక్ట్‌లో నేర్చుకున్న విషయాలు మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. రైతులతో కలిసి చేసిన వ్యవసాయ పనులు మర్చిపోలేనివి. ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు గ్రామరైతుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటా. తరగతిలో నేను నేర్చుకున్న పాఠాలు రైతులకు క్షుణ్ణంగా వివరిస్తా.
– ఎస్.అశ్వినికుమారి, అగ్రికల్చర్ విద్యార్థి,
మల్లారెడ్డి యూనివర్సిటీ
తరగతి గదిలో నేర్చుకునే విద్యతోపాటు, క్షేత్ర స్థాయిలో సాగు పనులను పరిశీలిస్తూ ఆ పనులు చేయడంతో ఎక్కువ అవగాహన కలుగుతుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తాము నేర్చుకుంటున్న సబ్జెక్ట్‌పై క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన పొందుతున్నారు. గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా మండలంలోని శీలాంపల్లి గ్రామంలో వ్యవసాయ పనులు నేర్చుకుంటున్నారు. తాము తరగతి గదిలో చదువుకున్న విషయాలు రైతులకు తెలియజేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం తునికి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ అనుభవాలను రైతులకు వివరిస్తున్నారు.
చిలప్‌చెడ్(నర్సాపూర్):
రైతులకు సూచనలు...
గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా క్షేత్రస్థాయిలో విద్యార్థులు ప్రాజెక్ట్ మూడు నెలలు చేయాల్సి ఉండగా, నెలన్నర సమయం పూర్తయింది. ఈ సమయంలో వారు రైతులతో కలిసి వరినాట్లు వేయడం, పత్తి సాగులో మెలుకువలు, సాంకేతిక వ్యవసాయంలో భాగంగా డ్రోన్ల వినియోగం, సేంద్రీయ పద్ధతిలో వరి, మునగ సాగును పరిశీలిస్తున్నారు. వరికోత పూర్తికాగానే, కొయ్యకాళ్లలో మొక్కజొన్న సాగు చేసే పద్ధతులను నేర్చుకుంటున్నారు. అలాగే రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించి, భూసారానికి అనుకూలమైన పంటలు సాగుచేయాలని అవగాహన కల్పిస్తున్నారు.
భూసార పరీక్షలకు కావాల్సిన మట్టిని, నేల నుంచి ఏ విధంగా సేకరించాలో ప్రయోగాత్మకంగా రైతులకు వివరించారు. పత్తికి సోకిన చీడపీడల గురించి వివరించి, వాటి నివారణకు చర్యలు సూచించారు. వరి, ఇతర పంటల సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. రైతు నారువేసే సమయం నుంచి, పైరు కోసే వరకు ఏ సమయంలో ఏ పనులు చేయాలి? ముఖ్యంగా పురుగు మందులు పిచికారీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే పద్ధతులను వివరిస్తున్నారు. గ్రామాల రైతులు ప్రత్యామ్నాయ పంటల దిశగా మొగ్గు చూపకుండా, ఎక్కువగా వరి సాగుకే ఆసక్తి చూపుతున్నారని, పంటమార్పిడి చేసేలా సైతం విద్యార్థులు సూచిస్తున్నారు. గ్రామంలో కనీసం 15 మంది రైతులు తప్పనిసరిగా సేంద్రీయ వ్యవసాయం చేసేలా అవగాహన కల్పించారు. ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు గ్రామ రైతుల నుంచి వ్యవసాయంలో పూర్తి సమాచారం తెలుసుకోవడంతోపాటు, తాము నేర్చుకున్న విషయాలను రైతులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
సాగు విధానాల పరిశీలన..

క్షేత్రస్థాయిలో.. సాగు పాఠాలు

క్షేత్రస్థాయిలో.. సాగు పాఠాలు

క్షేత్రస్థాయిలో.. సాగు పాఠాలు