
లాంగ్ జంప్‌లో సాయితేజకు పతకం
సంగారెడ్డి: హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 11వ తెలంగాణ అథ్లెటిక్ క్రీడల్లో భాగంగా లాంగ్ జంప్ విభాగంలో అండర్ –16లో సంగారెడ్డి జిల్లాకు చెందిన కె.సాయి తేజ బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా అతడికి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ ఎండి జావిద్ అలీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మిగిలిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచి జిల్లాకు మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోవా మద్యం స్వాధీనం
మునిపల్లి(అందోల్): భారీ ఎత్తున గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ శంకర్ తెలిపారు. సోమవారం మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన గోవా మద్యం దొరికింది. మొత్తం 34 బాటిళ్లలో 14.850 లీటర్ల గోవా మదాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ అనుదీప్, వినారెడ్డి, నజీర్‌పాషాతో పాటు సిబ్బంది ఉన్నారు.
గంజాయి స్వాధీనం..
పటాన్‌చెరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఘటన ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎకై ్సజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ వివరాల ప్రకారం... జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రామచంద్రపురంలో సోమవారం దాడులు నిర్వహించారు. కంజర్ల రమేశ్, దినేశ్‌ల నుంచి 385 గ్రాముల గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు.
కాపర్ వైర్ చోరీ
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి, కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండలంలోని కట్కూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా... గ్రామానికి చెందిన కొలుగూరి వెంకట్‌రెడ్డి పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైర్‌ను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. గుర్తించిన పలువురు రైతులు విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులకు చెప్పారు. వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో దాదాపు 10ఎకరాల్లో ఆదివారం వరి నాట్లు చేశారు. దీంతో రైతులు పొలానికి నీరు ఎలా పారించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మందుబాబులకు జరిమాన
సంగారెడ్డి క్రైమ్ / సిద్దిపేటకమాన్ / పటాన్‌చెరు టౌన్: ఉమ్మడి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడ్డ వాహనదారులకు జిల్లా న్యాయస్థానాలు జరిమాన విధించాయి. సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 11మందిని జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా అదనపు న్యాయమూర్తి షీకీల్ అహ్మద్ సిద్దిఖీ ఆరు మందికి రూ.2వేలు, ఇద్దరికి రూ.1500, మిగతా ముగ్గురికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 11మంది పట్టుబడ్డారని టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.18వేల జరిమాన, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష, బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ పట్టుబడిన నలుగురికి రూ.6వేల జరిమాన విధించినట్లు తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 22 మందిని పట్టుకున్నట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ చెప్పారు. సోమవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా 21 మందికి రూ. వెయ్యి చొప్పున, మరో వ్యక్తికి రూ. 2 వేలు జరిమాన విధించినట్లు పేర్కొన్నారు.
ఉపాధ్యాయుడిపై
పోక్సో కేసు నమోదు
సంగారెడ్డి క్రైమ్: కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతున్నట్టు తెలిపారు.

లాంగ్ జంప్‌లో సాయితేజకు పతకం

లాంగ్ జంప్‌లో సాయితేజకు పతకం