
గేదె తాడు అడ్డురావడంతో..
దుబ్బాక: రోడు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కీర్తి రాజు వివరాల మేరకు... మండలంలోని రాజక్కపేటకు చెందిన ముదిగొండ రాజేశం(55) గ్రామంలో కిరాణదుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్య చంద్రకళతో దుబ్బాకకు కిరాణసామగ్రి కోసం వెళ్లారు. ఆదివారం సాయంత్రం సామాను తీసుకొని బైక్‌పై భార్యాభర్తలు స్వగ్రామానికి వస్తున్న క్రమంలో చెల్లాపూర్ శివారులో రోడ్డుప్రక్కన కట్టేసిన గేదె తాడు అడ్డువచ్చి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో రాజేశం తలకు తీవ్రగాయం కావడంతోపాటు చంద్రకళకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించగా రాజేశం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కూరగాయలు తీసుకొస్తుండగా మహిళ..
దుబ్బాకరూరల్: భైక్ ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ ఘటన అక్బర్‌పేటభూంపల్లి మండలం చిట్టాపూర్‌లో జరిగింది. ఎస్‌ఐ హరీశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గుజ్జెటి బాలమణి(58) ఆదివారం సాయంత్రం గ్రామ చౌరస్తాలో కూరగాయలు కొనుగోలు చేసుకుని ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో భైక్‌పై సిద్దిపేట వైపు నుంచి రామాయంపేటకు వెళుతున్న రఘునందన్ అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చి మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా బైకిస్టుది మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనుగుల్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో బావ, బామ్మర్ది..
గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో బావ, బామ్మర్ది మృతి చెందారు. ఈ ఘటన గజ్వేల్ మన్సిపాల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో గల రాణే కంపెనీ ఎదుట ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన రంగయ్య కూతురు సంధ్యను మిరుదొడ్డి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌కు ఇచ్చి ఏడాదిన్నర క్రితం వివాహం జరిపించారు. సంధ్య, రాజ్‌కుమార్ దంపతులు ఉపాధి కోసం వెళ్లి మేడ్చల్ పరిధిలోని కేఎల్‌ఆర్ కమాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాగా, సంధ్య అమ్మమ్మగారి గ్రామమైన యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన బోనాల పండుగకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం రాజ్‌కుమార్ అత్తగారి గ్రామమైన కోనాపూర్‌కు బస్సులో చేరుకున్నారు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో బావ రాజ్‌కుమార్‌ను మేడ్చల్‌లో దింపడానికి బామ్మర్ది సందీప్ కారులో బయలుదేరారు. వీరు ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళుతుండగా రాజీవ్ రాహదారిపై రాణే కంపెనీ ఎదుట ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజ్‌కుమార్, సందీప్ తీవ్ర గాయాలై దుర్మరణం చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బైక్ అదుపుతప్పి కిందపడిన దంపతులు
భర్త మృతి..భార్యకు గాయాలు

గేదె తాడు అడ్డురావడంతో..

గేదె తాడు అడ్డురావడంతో..

గేదె తాడు అడ్డురావడంతో..