
వ్యవసాయ ఉద్యమంలో పటేల్ కీలకపాత్ర
పటాన్‌చెరు టౌన్: రైతులను ఏకం చేయడంలో, భారతదేశ వ్యవసాయ ఉద్యమాన్ని రూపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లోని రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సర్దార్ వల్లభాయ్ పటేల్, రైతులు చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ఐసీఎస్‌ఎస్‌ఆర్ సహకారంతో నిర్వహిస్తోంది. సోమవారం ఈ చర్చా గోష్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడంలో ఐక్యత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతకుముందు ఎస్పీ పరితోష్ పంకజ్ గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ ఇండెక్స్ టి – సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఏఎస్ సంజయ్ జోషి, సామాజిక సమరస్థ మంచ్ జాతీయ కన్వీనర్ శ్రీ కె.శ్యామ్ ప్రసాద్, గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ కుమార్ ఆర్.పటేల్, సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్, డీన్ ప్రొఫెసర్ షీలా రెడ్డి, సోషియాలజీ ప్రొఫెసర్ నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, ఐసీఎస్‌ఎస్‌ఆర్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గీతంలో జాతీయ ఐక్యత సదస్సు
చర్చాగోష్టిని ప్రారంభించిన
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ