
మెడికల్ కోడింగ్‌లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ
సిద్దిపేట ఎడ్యుకేషన్: బయోటెక్నాలజీ విభాగంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మెడికల్ కోడింగ్‌లో వారం రోజుల పాటు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణను అందజేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, నేషనల్ గైడర్స్ ఫర్ మెడికల్ కోడర్స్ ఫౌండర్స్ కార్తీక్‌కుమార్ వెల్లడించారు. సోమవారం కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నేషనల్ గైడర్స్ ఫర్ మెడికల్ కోడర్స్ మధ్య ఐదేళ్లకు అవగాహన ఒప్పందం కుదిరిందని వీరు తెలిపారు.అనంతరం విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బయోటెక్నాలజీ విభాగాధిపతి రోహిని, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, బయోటెక్నాలజీ అధ్యాపకులు వేణు, ఎన్జీసీ ప్రతినిధులు పవన్, నీలకంఠం పాల్గొన్నారు.
నేషనల్ గైడర్స్ ఫర్
మెడికల్ కోడర్స్‌తో ఎంఓయూ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
డాక్టర్ సునీత