
కార్మిక చట్టాలను విస్మరిస్తున్న యాజమాన్యం
పటాన్‌చెరు టౌన్: కార్మిక చట్టాలను పరిశ్రమల యజమాన్యాలు విస్మరిస్తున్నాయని యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజయ్య అన్నారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి పాశమైలారంలోని సువెన్ ఫార్మా పరిశ్రమ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఫార్మా యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నదని ఆరోపించారు. కార్మికులను ఉత్పత్తిలో నేరుగా పని చేయించుకోవడం తప్పని అన్నారు. అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, పరిశ్రమ యూనియన్ నాయకులు వెంకటేశ్, చంద్రయ్య, శ్రీనివాస్, ప్రభు, రాజు, మల్లేశ్, లక్ష్మి పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర నాయకుడు రాజయ్య